: కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 20 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు కడప జిల్లా చిన్నమండెం వద్ద బోల్తా పడింది. అర్ధరాత్రి సమయంలో బస్సు బోల్తా పడడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణిస్తున్నారు.