: రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదు: మరోసారి స్పష్టం చేసిన మమతాబెనర్జీ

'ఏం కావాలన్నా ఇస్తా కానీ, రాష్ట్ర విభజనకు మాత్రం అంగీకరించేది లేద'ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ కోరుతూ డార్జిలింగ్ హిల్స్ లో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో బుర్ద్వాన్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ విడిపోదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు తాను ఎట్టి పరిస్థిితుల్లోనూ అంగీకరించనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు కేవలం కుట్రపూరితమని ఆమె చెప్పారు. అయితే ఈ కుట్రను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆమె అన్నారు. వేరే దేశం, ఈశాన్య రాష్ట్రాల నుంచి అక్రమ చోరబాటుదారులే గూర్ఖా జన్ ముక్తి మోర్చాను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు.