: హీరో రవితేజ దిగిన సెల్ఫీపై విమర్శలు!
హీరో రవితేజ సోదరుడు భరత్ అంత్యక్రియలకు ఆయన కుటుంబసభ్యుల్లో ముఖ్యులెవ్వరూ పాల్గొనని విషయం తెలిసిందే. ఆ మర్నాడే తన చిత్రం ‘రాజా ది గ్రేట్’ షూటింగ్ నిమిత్తం నటుడు రవితేజ అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లిపోయాడనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపై రవితేజ అభిమానులు, నెటిజన్ల నుంచి పలు విమర్శలు తలెత్తాయి కూడా. కట్ చేస్తే.. ఆ రోజు షూటింగ్ సమయంలో తోటి నటీనటులతో కలిసి రవితేజ దిగిన ఓ సెల్ఫీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటం గమనార్హం. ఈ సందర్భంగా రవితేజకు కొందరు నెటిజన్లు మద్దతిస్తుంటే... మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.