: సిట్ విచారణ దండగ.. బడా బాబులు తప్పించుకుంటారు: ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
విశాఖ భూ కుంభకోణంపై సిట్ విచారణ దండగ అని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రికార్డుల తారుమారు కేసులకే సిట్ పరిమితం కావడం విచారకరమని, భూ కబ్జాలు, రికార్డుల గల్లంతు, అసైన్డ్ భూముల అన్యాక్రాంతం తదితర అంశాలను సిట్ పరిధిలోకి తీసుకురావాలని ఆయన కోరారు. విశాఖ కేంద్రంగా సాగుతున్న భూబాగోతాలు బయటకు రావని, బడా బాబులు తప్పించుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ భూకుంభకోణం వ్యవహారంలో బాధితుల తరపున తాను రాజీలేని పోరాటం చేస్తానని, తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి ఓ లేఖ ద్వారా తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు.