: గత ఆరు నెలల్లో 1,600 మంది అమెరికా స్థానికులకు ఉపాధి కల్పించాం: విప్రో


గత ఆరు నెలల కాలంలో అమెరికాలోని 1600 మంది స్థానికులకు ఉపాధి కల్పించినట్లు  ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ విప్రో వెల్లడించింది. ఉద్యోగి వీసా కార్యక్రమాన్ని సమీక్షించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం మేరకు విప్రో ఈ ప్రకటన చేసింది. విప్రో మొత్తం ఉద్యోగుల్లో సుమారు సగం మంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పేర్కొంది.

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న విప్రో సంస్థ ..2016-17 ఆర్థిక సంవత్సరంలో 3 వేల మంది అమెరికాలోని స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో, అమెరికాలో ఆ సంఖ్య 14 వేలకు చేరుకుంది. ఇదిలా ఉండగా, వచ్చే రెండేళ్లలో 10వేల మంది అమెరికన్లకు ఉపాధి కల్పించడంతో పాటు, నాలుగు టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మరో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ గత నెలలో పేర్కొంది.

  • Loading...

More Telugu News