: నా భార్య ‘మిసెస్‌ ఇండియా’ ఫైన‌ల్స్ కు చేరడం సంతోషంగా ఉంది: న‌టుడు అజయ్


మిసెస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ 2017 పోటీల్లో ఫైనల్‌ రౌండ్‌కు ప్రముఖ టాలీవుడ్‌ నటుడు అజయ్‌ భార్య శ్వేత రావూరి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అజయ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపాడు. ‘మిసెస్ ఇండియా’ ఫైనల్స్ కు తన భార్య ఎంపిక కావడం సంతోషంగా, గర్వంగా ఉందని అన్నాడు. ఈ సందర్భంగా తన భార్య ఫేస్ బుక్ పేజీని పోస్ట్ చేసి, ఆమెను ఆశీర్వదించాలని, అలాగే లైక్‌ కూడా కొట్టాలని కోరాడు. కాగా, ‘మిసెస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ 2017’ ను హౌట్‌ మోంద్‌ నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News