: 2019 క్రికెట్ వరల్డ్ కప్ ను తిరుమల శ్రీవారికి బహుమతిగా ఇస్తాం: ఎమ్మెస్కే ప్రసాద్


2019 క్రికెట్ వరల్డ్ కప్ ను గెలిచి తిరుమల శ్రీవారికి బహుమతిగా ఇస్తామని టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఈరోజు ఆయన తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 క్రికెట్ వరల్డ్ కప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే సిద్ధమవుతోందని అన్నారు. . 2019లో కూడా వరల్డ్ కప్ ఇంగ్లాండ్ లోనే జరుగుతుందని, ఇప్పటి నుంచి తమ ప్రణాళిక ఆ డైరెక్షన్ లోనే ఉంటుందని చెప్పారు. టీమ్ ను వందశాతం బలోపేతం చేసి..2019 కప్ ను వెంకటేశ్వరస్వామికి కానుకగా ఇవ్వాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. అదేవిధంగా, టీమిండియా బాగా రాణిస్తోందని, తనకు బాగా తృప్తిగా ఉందని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోవడం బాధాకరమైన విషయమేనని, అయితే, ఓవరాల్ గా టీమిండియా బాగా రాణించిందని అన్నారు.

  • Loading...

More Telugu News