: కొత్త చిత్రంలో ఐశ్వర్యారాయ్ ఓ పాట కూడా పాడుతోందట!
పదిహేడేళ్ల క్రితం బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ నిర్మించిన హిట్ చిత్రం ‘తాళ్’. ఈ చిత్రంలో అనిల్ కపూర్ సరసన అందాల సుందరి ఐశ్వర్యారాయ్ నటించింది. తాజాగా, ఫన్నేఖాన్ చిత్రంలో వీళ్లిద్దరూ నటిస్తున్నారు. అయితే, వారిద్దరూ జోడీగా నటించడం లేదని ఆ చిత్ర దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా పేర్కొన్నారు. ఐశ్వర్యరాయ్ నటిస్తుందనే వార్తతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ పెరిగిందని, ఈ చిత్రంలో ఐశ్వర్య కొత్తగా కనిపిస్తుందని చెప్పారు.
ఆగస్టులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని, ఆగస్టు చివరి వారంలో చిత్ర యూనిట్ తో ఐశ్వర్య కలుస్తుందని పేర్కొన్నారు. కాగా, పదిహేడేళ్ల క్రితం విడుదలైన డచ్ చిత్రం ‘ఎవ్రీబడీస్ ఫేమస్’ ఆధారంగా ఫన్నేఖాన్ సినిమాను తెరకెక్కించనున్నారు. ‘ఫన్నేఖాన్’లో నటించనున్న ఐశ్వర్యరాయ్ ఈ చిత్రంలో ఓ పాట కూడా పాడుతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.