: యూట్యూబ్ దుమ్ము దులిపేసిన బాహుబ‌లి-2 ట్రైల‌ర్‌.. ఏకంగా 150 మిలియ‌న్ల వ్యూస్‌!


టాలీవుడ్ యువ న‌టులు ప్ర‌భాస్‌, రానాలు ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి-2 బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల సునామీ సృష్టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు యూ ట్యూబ్‌లో ఉంచిన ట్రైల‌ర్ మొద‌టి రోజు నుంచే అత్య‌ధిక వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ రోజు ఈ ట్రైల‌ర్ 150 మిలియ‌న్ల వ్యూస్ దాటేసింద‌ని బాహుబ‌లి-2 టీమ్ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపింది.

భారతీయ సినీ చరిత్రలోని ఎన్నో రికార్డులను బద్దలుకొట్టిన బాహుబలి-2 సినిమా తెలుగు సినిమా స్థాయి ఎటువంటిదో నిరూపించింది. ఈ సినిమాను త్వరలోనే చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో విడుదల చేయనున్నారు. 

  • Loading...

More Telugu News