: లోధా కమిటీ సిఫారసులపై మండిపడ్డ బీసీసీఐ మాజీ కార్యదర్శి
లోధా కమిటీ సిఫారసుల మేరకు బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ ప్రత్యేక ఆహ్వానితునిగా ఎంపికైన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన్ షా, సంస్కరణల సిఫారసులపై మండిపడ్డారు. 70 ఏళ్లు పైబడిన వారు బీసీసీఐలో ఉండకూడదన్న నిబంధనే ఆయన మండిపాటుకు కారణం. 73 ఏళ్ల నిరంజన్ షా ఏ రకంగానూ బీసీసీఐలో ఉండటానికి అర్హుడు కాదు. కానీ వయసు నిబంధన వల్ల అనర్హత వేటు పడిన వారందరూ ఒత్తిడి చేయడంతో ఆయన్ని కమిటీలో ప్రత్యేక ఆహ్వానితునిగా తీసుకున్నారు.
ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ - `81 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ దేశ రాష్ట్రపతిగా ఉండొచ్చుగానీ, బీసీసీఐలో మాత్రం 70 ఏళ్ల లోపు వారే ఉండాలా? ఇదెక్కడి న్యాయం?` అని ప్రశ్నించారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీకి రాజీవ్ శుక్లా నాయకత్వం వహిస్తుండగా, సౌరవ్ గంగూలీ, నాబా భట్టాచార్జీ, టీసీ మాథ్యూ, అమితాబ్ చౌదరి, అనిరుధ్ చౌదరి, జే షా లు సభ్యులుగా ఉన్నారు.