: ఢిల్లీలో మూసివేతకు సిద్ధమైన 43 ‘మెక్‌డొనాల్డ్స్’ రెస్టారెంట్లు
ఈటింగ్ హౌస్ లైసెన్సు ముగియడంతో ఢిల్లీలో ఉన్న కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్(సీపీఆర్‌ఎల్) ఆధ్వర్యంలో నడిచే 55 మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లలో 43 రెస్టారెంట్లను మూసివేస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఆర్ఎల్ ప్రతినిధి విక్రమ్ బక్షి మాట్లాడుతూ... ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గడువు ముగియడంతో తమ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆయా రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నామని పేర్కొన్నారు.
తాజాగా మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధులకు, సీపీఆర్‌ఎల్ సభ్యులకు మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరమే ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, సీపీఆర్‌ఎల్, మెక్‌డొనాల్డ్స్ ల మధ్య ఉన్న విభేదాలతోనే రెగ్యులేటరీ హెల్త్ లైసెన్సుల పొడిగింపుకోసం సీపీఆర్‌ఎల్ దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది. ఏకంగా 43 మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను మూసివేయనుండడంతో సుమారు 1,700 మంది ఉద్యోగాలను కోల్పోవలసి వస్తోంది.