: రాష్ట్రపతి ఎన్నికలు: 90 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించిన ఎన్నికల కమిషన్‌


త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక‌ల బ‌రిలో ఎన్డీఏ అభ్య‌ర్థిగా రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ అభ్య‌ర్థిగా మీరా కుమార్ పోటికి దిగిన విష‌యం తెలిసిందే. వారితో పాటు మ‌రో 90 మంది అభ్య‌ర్థులు కూడా రాష్ట్రపతి పదవి కోసం నామినేషన్ వేశారు. అయితే, ఈ రోజు ఆ 90 మంది నామినేషన్‌ పేపర్లను ఈసీ తిరస్కరించింది. ఇందుకు గ‌ల కార‌ణాలు తెలుపుతూ... అభ్య‌ర్థులు స‌మ‌ర్పించిన ప‌త్రాలు స‌రిగాలేవ‌ని పేర్కొంది. అంతేగాక‌, వారికి చట్టప్రతినిధుల మద్దతు కూడా లేద‌ని చెప్పింది. ఈ ఎన్నిక‌ వచ్చేనెల‌ 17న జ‌ర‌గ‌నుంది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ వచ్చే నెల 20న జరుగుతుంది.

  • Loading...

More Telugu News