: మా నాన్న మమ్మల్ని బాగా చూసుకునేవారు: హాస్యనటుడు పృథ్వీరాజ్‌ తనయుడు సాయిశ్రీనివాస్


ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మికి భరణం కింద నెలకు రూ.8 లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తాజాగా ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ తనయుడు సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, తన తల్లి, తండ్రి మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. కుటుంబ గొడవలు కోర్టు వరకు వెళ్తాయని అనుకోలేదని, తన తల్లి వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని సాయి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. తనను, తన చెల్లెలని తన తండ్రి పృథ్వీరాజ్ బాగా చూసుకునేవారని చెప్పారు. కాగా, పృథ్వీరాజ్ తన భార్య శ్రీలక్ష్మిని గత ఏడాది ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. రాజీకి యత్నించినా భర్త పట్టించుకోకపోవడంతో శ్రీలక్ష్మి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీంతో,ఆమెకు  ప్రతినెలా భరణం కింద రూ.8 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News