: 'స్వచ్ఛ భారత్' పదాన్ని సరిగా రాయలేకపోయిన బీజేపీ ఎంపీ!
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ మీనాక్షీ లేఖి `స్వచ్ఛ భారత్` పదాలను హిందీలో తప్పుగా రాసినట్టుగా ఉన్న చిత్రం ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బహిరంగ మూత్రవిసర్జన చేస్తూ స్వచ్ఛ భారత్ భావనను మంట కలిపిన కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ చిత్రంతో పాటు మీనాక్షీ లేఖి చేసిన పనితో బీజేపీపై నెటిజన్ల దాడి పెరిగింది.
ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ వారు కాలుష్య రహిత వాహనాల వాడకం గురించి ప్రచారం చేసేందుకు నిర్వహించిన కార్యక్రమంలో మీనాక్షి లేఖి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, హర్షవర్ధన్‌లు కూడా హాజరయ్యారు. గతవారం ప్రతి ఒక్కరు హిందీ తప్పకుండా నేర్చుకోవాలి, ఇది మన జాతీయ భాష, దేశ అభివృద్ధికి భాషే మూలాధారం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే.