: కేసీఆర్ మద్దతుపై ఒవైసీల వైఖరి ఏమిటి?: వీహెచ్
రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రతిపాదించిన కోవింద్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలపడం పట్ల ఎంఐఎం స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. కేసీఆర్ వైఖరి పట్ల ఒవైసీ సోదరులు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో అప్పటి లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ పాత్ర ఎంతో ఉందని... అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులపై ఉందని అన్నారు. కానీ, కేసీఆర్ మాత్రం మీరాకుమార్ ను ఓడించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ఒవైసీ సోదరులు స్పందించాలని అన్నారు. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా మీరాకుమార్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.