: అదే జరిగితే టీమిండియాకు మరో మన్మోహన్ సింగ్ దొరికినట్టే: సోషల్ మీడియాలో సెటైర్లు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఖరితో విసిగిపోయి హెడ్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కోహ్లీ కోరుకుంటున్న రవిశాస్త్రి కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో, రవిశాస్త్రిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెటైరిక్ గా కామెంట్ చేస్తున్నారు. రవిశాస్త్రి కోచ్ అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను తలపిస్తాడని ఎద్దేవా చేస్తున్నారు. పేరుకు ప్రధాని అయినా సోనియాగాంధీ కనుసన్నల్లో మన్మోహన్ నడిచారని... ఇప్పుడు టీమిండియాలో కూడా అదే రిపీట్ అవుతుందని అంటున్నారు. కోచ్ పదవికి శాస్త్రి దరఖాస్తు చేస్తే... టీమిండియాకు మన్మోహన్ దొరికినట్టేనని ఎద్దేవా చేస్తున్నారు. అంటే అంతా కోహ్లీనే నడుపుతాడని వారి భావన. మన్మోహన్ సింగ్ ను ఇప్పటికే రాజకీయాల్లో చూశామని... ఇండియన్ క్రికెట్లో మరోసారి చూడలేమని అంటున్నారు.