: దేవినేని ఉమా తన వదినను చంపేశారని జనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు: వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్


ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ దుమ్మెత్తి పోశారు. దేవినేని ఉమా తన వదినను చంపేశారని జనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. సొల్లు కబుర్లు చెప్పే ఉమా ఓ పిట్టలదొర అని, ఆయన ఇరిగేషన్ శాఖా మంత్రి కాదని, ఓ బ్రోకర్ అని తీవ్ర విమర్శలు చేశారు. దేవినేని బ్రోకరేజ్ చేస్తూ పెదబాబు, చినబాబుకు డబ్బులిస్తున్నారని ఆరోపించారు. మైలవరానికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేని మంత్రి అని మండిపడ్డారు.

దేవినేని ఉమా ఇరిగేషన్ శాఖ మంత్రిగా సరిపోరని, పిట్టల దొర శాఖకు అయితే ఆయన కరెక్ట్ గా సరిపోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నాయకుడు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఉమాకు లేదని చంద్రబాబులాగా వెన్నుపోటు రాజకీయాలు చేసే వ్యక్తి వైఎస్ జగన్ కాదని .. ప్రజల తరపున పోరాడే వ్యక్తి తమ నాయకుడని అన్నారు. ఎన్టీఆర్ ను రాళ్లతో, చెప్పులతో కొట్టించారని, 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడైనా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడినారా? అని ప్రశ్నించారు. పోలవరాన్ని సాధించింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ‘దేవినేని ఉమా! మీరు అన్న మాటలపై నేను చర్చకు సిద్ధం. దేవినేని ఉమా ప్లేస్, టైం చెప్పు’ అంటూ జోగి రమేష్ సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News