: గరిష్ఠంగా ఏడేళ్ల శిక్షకు అవకాశం... అక్బరుద్దీన్ పై హత్యాయత్నం కేసులో అందరూ తక్షణమే విడుదల!


ఎంఐఎం నేత అక్బరుద్దీన్ పై హత్యాయత్నం జరిగిన సమయంలో స్పాట్ లో ఉన్నవారిని మాత్రమే కోర్టు దోషులుగా పేర్కొందని, ఆరోపణలు వచ్చిన మిగతా అందరినీ నిర్దోషులుగా ప్రకటించిందని నిందితుల తరఫు న్యాయవాది మీడియాకు తెలిపారు. ఈ కేసులో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే జైల్లో ఉండగా, మిగతా నిందితులంతా బెయిల్ పై బయటే ఉన్నారని, అందరూ నేటి కోర్టు తీర్పు కోసం వచ్చారని తెలిపారు. జైల్లోని ఆరుగురిలో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ణయించిందని, మిగతా వారు ఫార్మాలిటీస్ తరువాత సాయంత్రం, లేదా రేపు విడుదలవుతారని తెలిపారు. దోషులకు మధ్యాహ్న భోజన విరామం తరువాత శిక్ష ఖరారు కావచ్చని లేకుంటే రేపు శిక్షపై తీర్పు రావచ్చని అన్నారు. వీరిపై ఉన్న సెక్షన్ల ప్రకారం గరిష్ఠంగా ఏడు సంవత్సరాల శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే సుమారు ఆరేళ్లు జైల్లో ఉన్న అందరికీ శిక్షాకాలం పూర్తయినట్టేనని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News