: తెలివైన రైతు...సెల్ఫీ పిచ్చిని క్యాష్ చేసుకుంటున్నాడు!


రైతులందు తెలివైన రైతులు వేరు అన్నట్టు కర్ణాటకకు చెందిన ఒక రైతు పంట దిగుబడి రాకున్న ఫర్వాలేదు అన్న రీతిలో పొలంలో పొద్దుతిరుగుడు పువ్వుల పంటతో సంపాదిస్తున్నాడు. అదేంటి రైతు పంటవేసి దిగుబడిరాకున్నా ఫర్వాలేదుకోవడం ఏంటన్న అనుమానం వచ్చిందా? అయితే చదవండి... బెంగళూరు శివార్లలో చామరాజానగర్ జిల్లా గుండ్లుపేట తాలూకా బేగూర్ గ్రామానికి చెందిన కుమార్ (42) అనే రైతుకు 766 జాతీయ రహదారి పక్కన 6 ఎకరాల పొలం ఉంది. ఇందులో గత ఆరేళ్లుగా ఆయన పొద్దుతిరుగుడు పూలు పండిస్తున్నారు.

కేరళ, ఊటీ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ఈ జాతీయ రహదారి మీదుగా వెళ్తుంటారు. వాహనాల్లో తిరిగి వెళ్తూ అందంగా కనిపించే పొద్దుతిరగుడు పూల తోటలను చూడడం, అందులో దిగి సెల్పీలు దిగడం, కొన్ని మొక్కలను ధ్వసం చేయడం జరుగుతోంది. దీంతో కాపలా కాసి వారిని వారించినా ఫలితం ఉండడం లేదు. దీంతో బాగా ఆలోచిన ఆయన తోటలో సెల్ఫీ దిగాలంటే 20 రూపాయలు చెల్లించాలని నిబంధన విధించాడు. ఒక యువకుడ్ని ఇందుకోసం నియమించాడు. అతనితో పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయించడం మొదలు పెట్టాడు. దీంతో తనకు 40 వేల రూపాయల ఆదాయం వచ్చిందని కుమార్ సంబరపడిపోతున్నాడు. వర్షాభావం వల్ల దిగుబడి తగ్గినా సెల్ఫీ క్రేజ్ కారణంగా తనకు ఆదాయం వస్తోందని కుమార్ ఆనందంగా చెప్పడం విశేషం. 

  • Loading...

More Telugu News