: టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న మరో మాజీ క్రికెటర్
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం పోటీ పడుతున్న వారి జాబితా అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ రేసులో మరో మాజీ క్రికెటర్ నిలిచాడు. ఇండియా తరపున 162 వన్డేలు, 33 టెస్టులు ఆడిన ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం ఆయన జూనియర్ జట్టుకు కోచ్ గా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ తో అతని మూడేళ్ల పదవీకాలం ముగుస్తోంది. దీంతో చీఫ్ కోచ్ పదవిపై వెంకటేష్ ప్రసాద్ ఆసక్తి చూపుతున్నాడు. హెడ్ కోచ్ రేసులో ఇప్పటికే సెహ్వాగ్, టామ్ మూడీ, రవిశాస్త్రి, రిచర్డ్ పైబస్, లాల్ చంద్ రాజ్ పుత్ లు ఉన్నారు.