: శిరీష కేసులో సీసీ టీవీ పుటేజ్ పై అనుమానాలు!


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీషపై కేసులో మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిరీష పని చేసే స్టూడియోలో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన రోజు కెమేరాలు పని చేయలేదు. మరోవైపు కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ లోని సీసీ కెమెరా పుటేజ్ జూన్ 3వ తేదీ వరకే లభ్యమైంది.

దీంతో శిరీష, రాజీవ్, శ్రవణ్ వెళ్లిన దృశ్యాలు రికార్డు కాలేదు. అంతే కాకుండా ఈ కేసులో దర్యాప్తు ముగిసిన అనంతరం పోలీసులు మాట్లాడుతూ, తమవద్ద సాక్ష్యాలు ఉన్నాయని, సీసీ పుటేజీ సాక్ష్యాలు సంపాదించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ పుటేజీ ఏమైంది? పోలీసులు దీనిని ఎందుకు బయటపెట్టడం లేదు? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. 

  • Loading...

More Telugu News