: మీడియా కథనాలన్నీ అవాస్తవం... మా ఇద్దరిదీ ఒకే అభిప్రాయం: సైఫ్ అలీఖాన్


తన కుమార్తె సారా అలీ ఖాన్ సినీ రంగప్రవేశంపై తన అభిప్రాయాలపై మీడియా కథనాలన్నీ అవాస్తవాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు. తన కుమార్తె సినీ రంగప్రవేశానికి తన మద్దతు ఉందని చెప్పాడు. తండ్రిగా తన కుమార్తె మంచిని కాంక్షిస్తానని మీడియా గుర్తించాలని కోరాడు. సారా సినీ రంగ ప్రవేశంపై ఆమె తల్లి అమృతాసింగ్‌ తో తనకు విభేదాలు వచ్చాయని, అమృత ఆమె సినీ రంగప్రవేశాన్ని స్వాగతిస్తున్నట్టు, తాను వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయని, అవన్నీ అవాస్తవాలని తేల్చిచెప్పాడు.

సారా బాలీవుడ్ ప్రవేశంపై తామిద్దరం ఒకే అభిప్రాయంతో ఉన్నామని అన్నాడు. అమృతాసింగ్‌ తో తాను చర్చించలేదని, అయితే తన కుమార్తెతో అన్ని విషయాలు మాట్లాడానని చెప్పాడు. తండ్రిగా మిశ్రమ భావోద్వేగంతో ఆమె సినీ రంగ ప్రవేశం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సైఫ్ అలీ ఖాన్ చెప్పాడు. కాగా, సైఫ్, అమృతాసింగ్‌ దంపతులకు సారా, ఇబ్రహీం అనే పిల్లలు కలిగారు. 2004లో అమృతాసింగ్‌ తో విడిపోయిన సైఫ్, కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నాడు. సైఫ్, కరీన దంపతులకు తైమూర్ అనే కుమారుడున్నాడు.

  • Loading...

More Telugu News