: రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటరు మెగాస్టార్ చిరంజీవి!
రాష్ట్రపతి ఎన్నికల సమరం మొదలవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి, చివరి ఓటర్లు తెలుగువారే కావడం విశేషం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయనున్న అభ్యర్థుల జాబితాతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రూపొందింది. ఈ జాబితా ప్రకారం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేయనున్నారు. చివరి ఓటును యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు పేరు చిట్టచివర ఉంది. రాజ్యసభ, లోక్ సభ, అసెంబ్లీ సభ్యుల పేర్లను ఈ జాబితాలో రాష్ట్రాల, పేర్ల మొదటి ఆంగ్ల అక్షరాల ఆధారంగా రూపొందించగా, అందులో తొలిపేరు చిరంజీవిది కావడం విశేషం.