: పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న పవిత్ర సంగమానికి పూజలు నిర్వహించనున్నారు. పట్టిసీమ నుంచి వస్తున్న నీరు కృష్ణా నదిలో కలుస్తున్న ప్రదేశంలో ఈ సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.