: ఏంటి, వంశీగారు.. తప్పించుకుని తిరుగుతున్నారు?: వైసీపీ ఎమ్మెల్యే రోజా


టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇటీవల ఓ ఇబ్బందికర సన్నివేశం ఎదురైందట. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చారు. యథావిధిగా ఆయన వెనుక రెండు, మూడు వాహనాల్లో ఆయన అనుచరులు విమానాశ్రయానికి వచ్చారు. వాహనం దిగి ఎయిర్ పోర్టు లాంజ్ లోకి వెళ్లిన ఆయనకు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా కనిపించారు. దీంతో, ఆయన తన అనుచరులతో కలసి రెండడుగులు వెనక్కు వచ్చేశారు. ఆ తర్వాత రోజా తమవైపే వస్తుండటంతో... ఆ విషయాన్ని అనుచరులు ఆయనకు తెలిపారు. దీంతో, అనుచరులతో మాట్లాడుతూనే ఆయన ఎయిర్ పోర్టు బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని గమనించి రోజా అక్కడే ఆగిపోయారట.

ఆ తర్వాత ప్రయాణం కోసం బోర్డింగ్ జరిగిపోయింది. వంశీ ఫ్లైట్ లోకి ఎక్కారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన రోజా, "ఏంటి వంశీగారు, తప్పించుకుని తిరుగుతున్నారు?" అంటూ నవ్వుతూ ప్రశ్నించారట. దీనికి సమాధానంగా, "ఏం లేదు మేడమ్. అనుచరులు ఉన్నారు కదా.. వారితో మాట్లాడుతున్నాను" అని చెప్పారట. ఇంతకూ సంగతి ఏమిటంటే... రోజాతో ఏదైనా మాట్లాడితే... ఆ విషయం బయటకు పొక్కితే... ఆ తర్వాత ఆ సంగతి అధినేతకు తెలిస్తే... ఏమవుతుందో అనే భయంతోనే వంశీ తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. దాదాపు టీడీపీ నేతల పరిస్థితి అంతా ఇలాగే ఉందని అంటున్నారు.

  • Loading...

More Telugu News