: భార్యకు నెలకు రూ. 8 లక్షలు ఇవ్వు: '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్విని ఆదేశించిన కోర్టు


టాలీవుడ్ ఇండస్ట్రీ హాస్యనటుడు, '30 ఇయర్స్ ఇండస్ట్రీ'గా పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్, తన భార్యకు నెలకు రూ. 8 లక్షలు భరణంగా చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 1984లో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మిని శేషు అలియాస్ మూర్తి అలియాస్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. నటనపై ఆసక్తితో తరచూ చెన్నైకి వెళుతూ, ఒక్కో అవకాశాన్నీ అందుకుంటున్న తరుణంలో తమ కాపురాన్ని హైదరాబాద్ కు మార్చారు.

ఆపై భార్యతో గొడవపడి గత సంవత్సరం ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. పెద్ద మనుషుల మధ్య రాజీకి ప్రయత్నించినా పృథ్వీ పట్టించుకోలేదు. ఆపై శ్రీలక్ష్మి నవంబర్ లో పోలీసు కేసు పెడుతూ, తన భర్త ఆదాయ పరిస్థితి బాగానే ఉందని నెలకు రూ. 10 లక్షలు ఇప్పించాలని ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన న్యాయస్థానం బాధితురాలికి నెలకు రూ. 8 లక్షలు పృథ్వీ భరణం కింద ఇవ్వాలని తీర్పిచ్చింది.

  • Loading...

More Telugu News