: స్థానిక నేతను 'పేగులు తీస్తా... కాళ్లు నరికిస్తా' అని బెదిరించిన టీఎస్ మంత్రి చందూలాల్


ఈ నెల 26న రాత్రి జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న ఓ ఆడియో ఇప్పుడు తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. మంత్రి చందూలాల్, ములుగు - సమ్మక్క, సారలమ్మ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతి మధ్య జరిగిన సంభాషణలో చందూలాల్ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. 'నమస్తే సార్' అని మాటలు ప్రారంభించిన భిక్షపతిని ఎద్దేవా చేస్తూ, ప్రత్యేక జిల్లా కావాలంటావా? అని నోటికొచ్చినట్టు తిట్టారు. చిల్లరగాళ్లని తిడుతూ, 'నీ బతుకేంది, నువ్వేంది?' అంటూ రెచ్చిపోయారు. తన అనుచరులకు చెబితే కాళ్లు నరికేస్తారని హెచ్చరించారు. తాను తలచుకుంటే ఆదుకునేందుకు ఎవరూ రారని, ములుగులో ఉండలేవని హెచ్చరించారు.

ఇక ఇదే విషయమై చందూలాల్ ను సంప్రదిస్తే, భిక్షపతి పెద్ద మిలిటెంట్ అని, రాత్రి పూట ఫోన్ చేసి వాదనకు దిగితే, తానే బాగా తిట్టానని అన్నారు. తన భార్యకు ఉద్యోగం కావాలని వచ్చాడని, అలా కుదరదని చెప్పినందుకే ఇలా నకరాలు చేస్తున్నాడని ఆరోపించారు. అతనిపై పోలీసు కేసు పెట్టనున్నట్టు స్పష్టం చేశారు. కాగా, మేడారం జాతర వస్తున్నందున ములుగు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మంత్రికి ఫోన్ చేసిన తనను బెదిరించి, తిట్టాడని, చందూలాల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేస్తానని భిక్షపతి వెల్లడించారు.

  • Loading...

More Telugu News