: మేము ఊహించలేదు...షాక్ కు గురయ్యాం: గర్భం దాల్చడంపై టెన్నిస్ స్టార్ సెరెనా
గర్భందాల్చడాన్ని తాము నమ్మలేకపోయామని ప్రముఖ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తెలిపింది. రిడ్డిట్ వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియన్ తో సహజీవనం చేస్తున్న సెరెనా ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ కు వారం రోజుల ముందు పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. దీంతో షాక్ కు గురయ్యానని చెప్పింది. దీంతో ఇంటికి వెళ్లి మరో ఐదు సార్లు పరీక్ష చేసుకుని ఫలితాలను ఒహానియన్ ముందుంచానని చెప్పింది.
దీంతో గర్భందాల్చానని గుర్తించిన ఒహానియన్ కూడా షాక్ కు గురయ్యాడని చెప్పింది. ఆ తరువాత తాను 23వ గ్రాండ్ స్లామ్ ను సాధించానని చెప్పింది. ఏడు నెలల గర్భవతినైనా తల్లిగా తనకు ఏమి అవసరమో తెలియడం లేదని చెప్పింది. ఇంకా చిన్నారి కోసం సిద్ధం కాలేదని తెలిపింది. వ్యానిటీ మ్యాగజీన్ కు నగ్నంగా పోజులిచ్చిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించింది. జనవరిలో మళ్లీ టెన్నిస్ కోర్టులో దిగుతానని సెరెనా తెలిపింది.