: మదర్ మేరీ విగ్రహం నుంచి రక్త కన్నీరు... క్యూ కడుతున్న జనం!
సృష్టిలో చిత్రవిచిత్రమైన ఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. ఆ మధ్య వినాయకుడి విగ్రహం పాలు తాగిందన్న వార్త వైరల్ గా మారి, విగ్రహాలకు పాలు తాగించేందుకు క్యూలు కట్టిన ఘటన ఆసక్తి రేపింది. తాజాగా, వరంగల్ జిల్లా ఐనవోలు మండలం సింగారం శివారు గుంటూరుపల్లిలోని లూర్ధుమాత దేవాలయంలో మేరీ మాత విగ్రహం కళ్ల నుంచి కన్నీరు, రక్తం లాంటి ద్రవం కారుతుండడం వైరల్ గా మారింది. ఈ చర్చిలో ఆదివారమే మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించగా, బుధవారం ఆ విగ్రహం కంటినుంచి రక్తం కారుతోంది. దీంతో ఈ విషయాన్ని చర్చి ఫాదర్ ఇన్ ఛార్జి బిషప్ జోసఫ్ కు సమాచారమందించారు. ఈ వింతను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. దీంతో చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.