: అమ్మకానికి ఎయిరిండియా రెడీ.. కేబినేట్ గ్రీన్ సిగ్నల్!


వేలకోట్ల రూపాయల నష్టాలతో పాటు, సిబ్బంది పనితీరుతో ప్రతిష్ఠను మసకబార్చుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వాటా విక్రయానికి కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, ఎయిరిండియాలో వాటాను విక్రయించాలన్న పౌర విమానయాన శాఖ ప్రతిపాదనకు కేబినెట్‌ అనుమతి తెలిపిందని అన్నారు. అయితే సంస్థలో ఎంత వాటా విక్రయించాలి? ఎయిరిండియా అప్పులు, హోటల్స్‌ ను ఏం చేయాలి? వంటి విషయాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఒక స్పష్టత వచ్చిన తరువాతే విక్రయం జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా, ఎయిరిండియాలో వాటా కొనుగోలుకు సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ తో కలిసి టాటా గ్రూప్‌ ఆసక్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News