: మలయాళ స్టార్ దిలీప్ కు వార్నింగ్ ఇచ్చిన భావన!


మలయాళ స్టార్ దిలీప్ కు సినీ నటి భావన వార్నింగ్ ఇచ్చింది. గతంలో వీరిద్దరూ మంచి స్నేహితులు, అయితే దిలీప్ రెండో వివాహం నేపథ్యంలో వీరి స్నేహం బీటలు వారింది. భావనను కారులో అపహరించి, వీడియోలు తీసిన ఘటనలో దిలీప్ హస్తం ఉండి ఉంటుందని దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తం అనుమానించింది. అయితే దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని దిలీప్ వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఒక టీవీ ఛానెల్ కు ఇంట్వర్యూ ఇచ్చిన ఆయన భావన రేప్ ఘటన గురించి స్పందిస్తూ, భావన వేధింపుల కేసులో ప్రధాన నిందితుడు జైల్లో ఉన్న పల్సర్ సునీ ఆమెకు మంచి స్నేహితుడని వ్యాఖ్యానించాడు. అందుకే స్నేహితులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.

దీనిపై భావన స్పందించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ, తాను స్నేహితులమని ఒక నటుడు చెప్పినట్టు తనకు తెలిసిందని, ఆ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని తెలిపింది. ఇలాంటి అవాకులు, చవాకులు పేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించింది. తాను నోరువిప్పి మాట్లాడితే విచారణపై ప్రభావం చూపుతుందని పోలీసులు సూచించడంతో మౌనంగా ఉన్నానని, తన మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఆమె హెచ్చరించింది. కాగా, పల్సర్ సునీ తనను జైలు నుంచి బెదిరిస్తున్నాడని దిలీప్ గతవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

  • Loading...

More Telugu News