: కక్ష్యలో మరో భారత్ కమ్యూనికేషన్ ఉపగ్రహం.. ఫ్రెంచ్ గయానా నుంచి విజయవంతంగా ప్రయోగం!
ఇప్పటికే కక్ష్యలో తిరుగుతున్న 17 కమ్యూకేషన్ ఉపగ్రహాలకు మరొకటి జతకలిసింది. ఫ్రెంచ్ గయానా నుంచి ఈ తెల్లవారుజామున జీశాట్-17 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. ఇందులోని సీ, ఎస్ బ్యాండ్లు వివిధ రకాల కమ్యూనికేషన్ సేవల విస్తృతికి పనికొస్తాయి. గతంలో పంపిన ఇన్‌శాట్ ఉపగ్రహాల్లానే రెస్క్యూ సేవలు, ఉపగ్రహ ఆధారిత సెర్చ్ తదితర వాటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఉపగ్రహం అప్పుడే కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్) నియంత్రణలోకి వచ్చినట్టు ఇస్రో పేర్కొంది. దీని జీవితకాలం 15 ఏళ్లని తెలిపింది.