: ఆర్బీఐ నుంచి గుడ్ న్యూస్.. ప్రారంభమైన రూ.200 నోట్ల ప్రింటింగ్.. అతి త్వరలో చలామణిలోకి!
నోట్ల రద్దు తర్వాత చిన్న నోట్లు లేక అల్లాడిపోతున్న ప్రజలకు భారతీయ రిజర్వు బ్యాంకు శుభవార్త చెప్పింది. రూ.200 నోట్ల ముద్రణ జోరుగా సాగుతున్నట్టు తెలిపింది. కొన్ని వారాల క్రితమే ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్‌లో వీటి ముద్రణ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. గతేడాది నవంబరులో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2 వేలు, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. అయితే రూ.2 వేలు, రూ.500 నోట్లు ఎక్కువగా బయటకు రావడంతో చిల్లర కోసం ప్రజలు అవస్థలు పడ్డారు. జేబులో డబ్బులున్నా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. తాజాగా హై సెక్యూరిటీ ఫీచర్లతో ముద్రిస్తున్న ఈ 200 నోట్లు చలామణిలోకి వస్తే ప్రజలకు చిల్లర కష్టాలు తీరినట్టే!