: తెలంగాణ పోలీస్ ఆఫీసర్ కు అంతర్జాతీయ గౌరవం.. సీపీ మహేశ్ భగవత్ కు ‘హీరో’ అవార్డు


1995 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ లోని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో అనేక కీలక పదవుల్లో పని చేశారు. అదే సమయంలో, మహిళల అక్రమ రవాణా (ఉమన్ ట్రాఫికింగ్) నిరోధించే నిమిత్తం ఆయన పని చేసిన ప్రతి ప్రాంతంలో తన శాయశక్తులా కృషి చేశారు. ఈ విషయమై ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తించిన అమెరికా ప్రభుత్వం మహేశ్ మురళీ భగవత్ కు హీరో అవార్డు ను ప్రకటించింది.

ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మహిళల అక్రమ రవాణాపై 2004 నుంచి నేను పని చేస్తున్నాను. మహిళల అక్రమ రవాణాను పూర్తిగా నివారించేందుకు ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది ప్రివెన్షన్.. బాధితులు లేకుండా చూడాలి. డిమాండ్ అండ్ సప్లైపై ఇది ఆధారపడి ఉంటుంది. మహిళలను అక్రమంగా పంపించాలని ఎవరు డిమాండ్ చేస్తున్నారో వారిని నియంత్రించడం ద్వారా సప్లై ఆగుతుంది. దీనిని పక్కాగా అమలు చేయాలి. రెండోది ప్రొటెక్షన్.. అక్రమ రవాణా నుంచి కాపాడిన మహిళలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. మూడోది ప్రాసిక్యూషన్.. ఉమన్ ట్రాఫికింగ్ కు పాల్పడిన నేరస్తులకు తప్పకుండా శిక్షపడేలా చూడాలి’ అని అన్నారు. కాగా, త్వరలోనే హీరో అవార్డును అందుకోనున్న మహేశ్ భగవత్ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News