: సన్నీలియోన్ పై రూపొందించిన డాక్యుమెంటరీలో ఆసక్తికర విషయాలు!


ఒకప్పటి శృంగార తార, ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీలియోన్ జీవితం ఆధారంగా ‘మోస్ట్ లీ సన్నీ’ అనే డాక్యుమెంటరీ కొన్ని నెలల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో సన్నిలియోన్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. సినిమా రంగంలోకి రాకముందు, సన్నీ లియోన్ ఓ మ్యాగజైన్ కోసం తొలిసారి నగ్నంగా ఫొటోలు దిగిందట. శృంగార తారగా మారిన విషయాన్ని రహస్యంగా ఉంచడం కోసం, స్థానికంగా ఉన్న అన్ని దుకాణాల్లోని మ్యాగజైన్లను కొనేసేదట. అయితే, తమ కూతురు ఈ విధంగా ఫొటోలు దిగిందని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు సిగ్గుపడటమే కాదు, ఆవేదన కూడా చెందినట్టు ఆ డాక్యుమెంటరీలో చెప్పారు.

సన్నీలియోన్ నటించిన శృంగార చిత్రాలు విడుదలయ్యే వరకూ ఆమె అలాంటి సినిమాల్లో నటిస్తుందనే విషయం ఎవరికీ తెలియదట. చివరకు, సన్నీలియోన్ తల్లిదండ్రులకూ ఈ విషయం తెలియదు. ఈ సంగతి తెలిసిన తర్వాత ఆమె తల్లిదండ్రులు మందలించడమే కాదు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట. అయితే, చివరకు, సన్నిలియోన్ తీసుకున్న నిర్ణయానికే వారు ఆమెను వదిలేశారు. మొదట్లో, పెళ్లిళ్లలో కూడా తాను నృత్యం చేసే దానినని, తాను చేసిన పిచ్చి పనుల్లో ఇదొకటని ఆ డాక్యుమెంటరీలో సన్నీలియోన్ చెప్పింది.

  • Loading...

More Telugu News