: ‘ఇన్ ఫోకస్’ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ‘టర్బో 5’ విడుదల!
ఇన్ ఫోకస్ సంస్థ భారీ బ్యాటరీతో ‘టర్బో 5’ పేరిట ఓ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో లభించే ‘టర్బో 5’ రెండు వేరియంట్లలో విడుదలయింది. జులై 4వ తేదీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘అమెజాన్’లో ఈ స్మార్ట్ ఫోన్లు లభ్యం కానున్నట్టు కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. 2 జీబీ, 3 జీబీ ర్యామ్ తో, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఈ ఫోన్లు లభిస్తాయి. 2 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.6,999 కాగా, 3 జీబీ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. ‘టర్బో 5’ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే...
* 5.2 అంగుళాల డిస్ ప్లే
* 5 ఎంపీ పిక్సల్ సెల్ఫీ కెమెరా
* 13 ఎంపీ వెనుక కెమెరా
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* 1280X720 రిజల్యూషన్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టమ్
* 1.25 క్వాడ్-కోర్ మీడియా టెక్ ఎంటీ6737 ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ సొంతం.