: సినీ రచయిత కోన వెంకట్ ట్వీట్ కు సమాధానం ఇచ్చిన కేటీఆర్
సినీ రచయిత కోన వెంకట్ ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేశారు. వచ్చేనెల 1 నుంచి అమలులోకి వస్తోన్న జీఎస్టీ నేపథ్యంలో సినిమాకు విధించే పన్ను విషయంలో కేరళ ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుందని, జీఎస్టీలో భాగంగానే సినిమాకు పన్ను వసూలు చేస్తామని, ఇతర ఎటువంటి రకాల పన్నులు విధించబోమని తెలిపిందని అన్నారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కి స్పందించిన కేటీఆర్ ఈ అంశంపైనే తెలంగాణ ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు చిత్ర పరిశ్రమ ప్రతినిధులతో భేటీ అవుతున్నారని తెలిపారు.