: ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమే: ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా


ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం సినీ పరిశ్రమేనని, ఇక్కడ ఎవరి స్వార్థం వారిదేనని, బాధలో ఉన్న వారిని ఎవరూ పట్టించుకోరని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ రాజా అన్నారు. ఉదయ్ కిరణ్ స్మారకంగా ప్రతి ఏటా షార్ట్ ఫిలిం పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో షార్ట్ ఫిలిం పోటీల్లో విజేతలకు ఆయన పురస్కారాలు అందించారు.

ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడు ఉదయ్ కిరణ్ అని, అర్థాంతరంగా తనువు చాలించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు కష్టాల్లో ఉన్న ఉదయ్ కిరణ్ ని సినీ పరిశ్రమ ఆదుకుని ఉంటే ఈ రోజు ఉదయ్ కిరణ్ మన మధ్య ఉండేవాడని, ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన దుస్థితి కలిగేది కాదంటూ శివాజీరాజా ఉద్వేగానికి లోనయ్యారు.

  • Loading...

More Telugu News