: ఈ ఏడాది కూడా ముఖేష్ అంబానీ వార్షిక వేతనంలో మార్పు లేదు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ముఖేశ్ అంబానీ ఆ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ పదవిలో తొమ్మిదేళ్లుగా ఉన్న అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు. ఈ ఏడాది కూడా అదే వార్షిక వేతనాన్ని ఆయన పొందనున్నారు. ముఖేశ్ అంబానీ వార్షిక వేతనం రూ.38.75 కోట్లుగా ప్రతిపాదించినప్పటికీ, ఆయన స్వచ్ఛందంగా పరిమితి విధించుకోవడంతో ఈ ఏడాది కూడా రూ.15 కోట్లే ప్రకటిస్తున్నట్లు ‘రిలయన్స్’ తన 2016-17 వార్షిక నివేదికలో పేర్కొంది. కాగా, భారత్ లోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ, 2008-09 నుంచి రూ.15 కోట్లను వార్షిక వేతనంగా పొందుతున్నారు. 2009 నుంచి తన వార్షిక వేతనంపై అంబానీ స్వచ్ఛందంగా పరిమితి విధించుకున్నారు.