: కోకా కోలా కూల్ డ్రింక్ రేట్లలో పెరుగుదల!


కూల్ డ్రింక్స్ కంపెనీ కోకా కోలా తన కార్బోనేటేడ్ పానీయాల పోర్ట్ ఫోలియోలో ధరలను పెంచనున్న‌ట్లు తెలిపింది. వ‌చ్చేనెల 1 నుంచి జీఎస్టీ అమ‌లులోకి రానున్న నేప‌థ్యంలో ప్రస్తుతమున్న రేట్ల కంటే పెద్ద మొత్తంలో పన్ను శ్లాబులను ప్రతిపాదించారని, కూల్ డ్రింక్స్‌పై ఈ పన్ను శ్లాబులు 40 శాతంగా ఉన్నాయని తెలిపింది. దీంతో ధ‌ర‌లు పెంచ‌డం త‌ప్ప తమ ముందు ఎటువంటి అవకాశం లేద‌ని, అందుకే ఈ ప్ర‌క‌ట‌న చేస్తున్నామ‌ని పేర్కొంది. మ‌రోవైపు జీఎస్టీ ప్ర‌భావం త‌మ‌మీద ప‌డ‌క‌పోవ‌డంతో ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ కిన్లే రేట్లను తగ్గించనున్నట్టు తెలిపింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ను 18 శాతం జీఎస్టీ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చిన విష‌యం విదిత‌మే.

  • Loading...

More Telugu News