: ఆర్టీసీ బస్సులోకి ఎక్కి టిక్కెట్ కొనుక్కొని... ప్రయాణించిన ఎమ్మెల్యే రోజా
చిత్తూరు జిల్లాలోని నగరి ఎమ్మెల్యే రోజా ఈ రోజు తన సొంత నియోజక వర్గంలో ఏపీఎస్ ఆర్టీసీ నూతన సర్వీస్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె ఆర్టీసీ బస్సులోకి ఎక్కి టికెట్ తీసుకుని ప్రయాణించారు. ఆ బస్సులో కిటికీ పక్కన కూర్చున్న ఆమె తన బాల్యంలోనూ ఇలాగే కిటికీ పక్కన కూర్చొని ప్రయాణించే అలవాటు ఉండేదని వ్యాఖ్యానించారు. ఆ బస్సులో పలువురు వైసీపీ కార్యకర్తలు, ప్రయాణికులు కూడా ఉన్నారు. రోజా ముందు సీట్లో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ కిటికీలోంచి అందరినీ పలకరించారు. కాసేపు బస్సులోనే ప్రయాణించి ఎంజాయ్ చేశారు.