: వీటి పేరు వింటేనే చైనా, పాకిస్థాన్ లు కలవరపాటుకు ఎందుకు గురవుతున్నాయంటే..!


సైనికపరంగా భారత్ ను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని మోదీ అమెరికా పర్యటన కొనసాగిన సంగతి తెలిసిందే. రూ. 12 వేల కోట్లతో 22 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డ్రోన్లకు సంబంధించిన అంశం గత ఏడాదే బయటకు వచ్చింది. అప్పట్నుంచి చైనా, పాకిస్థాన్ లు కలవరపాటుకు గురవుతున్నాయి. ముఖ్యంగా చైనాకు ఈ కొనుగోలు ఒప్పందం ఏ మాత్రం రుచించడం లేదు. దీనికి కారణం ఈ డ్రోన్ల యొక్క శక్తిసామర్థ్యాలే.

ఈ డ్రోన్లు 34 గంటల పాటు 50 వేల అడుగుల ఎత్తులో నిరాటంకంగా ఉండగలవు. 1000 కిలోమీటర్ల దూరం వరకు శత్రువుల ఉనికి, కదలికలను పసిగట్టగలవు. 1700 కిలోల బరువైన పేలుడు పదార్థాలను సైతం ఇవి మోసుకుపోగలవు. అత్యాధునిక టెక్నాలజీలతో అత్యంత కచ్చితత్వంతో ఇవి పని చేస్తాయి. వీటికి వేగం కూడా చాలా ఎక్కువ. ఈ కారణాల వల్లే చైనా, పాకిస్థాన్ లు ప్రిడేటర్ డ్రోన్ల గురించి భయపడుతున్నాయి. 

  • Loading...

More Telugu News