: లీక్డ్ వీడియోతో 'జై లవ కుశ'పై ఒక్కసారిగా పెరిగిన అంచనాలు... కొన్ని ఫోటోలు!


ఎన్టీఆర్ కొత్త చిత్రం 'జై లవకుశ' టీజర్ అధికారికంగా విడుదల కాకుండానే లీక్ కాగా, అందులోని దృశ్యాలు చిత్రంపై అభిమానుల అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. టీజర్ ను ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే దాన్ని కాపీ చేసిన పలు వెబ్ సైట్లు, కొన్ని దృశ్యాలను ప్రింట్ స్క్రీన్ తీసి వైరల్ చేశాయి. రావణాసురుడి విగ్రహం ముందు ఎన్టీఆర్ నడిచి వస్తుంటే, వెనక ఓ ఫైటర్ గాల్లోకి ఎగురుతున్నట్టు ఉన్న దృశ్యం, ఆపై ఏనుగు దంతాల వంటి ఆకృతి గల సింహాసనంపై చేతికి బలమైన మెటల్ చెయిన్ కట్టుకుని, ఓ గండ్ర గొడ్డలి పట్టుకుని ఎన్టీఆర్ వికటాట్టహాసం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు చిత్రంలో విలన్ పాత్రకు సంబంధించినవిగా అభిమానులు భావిస్తున్నారు. ఆ చిత్రాలను క్రోఢీకరిస్తూ తయారు చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News