: మరోసారి తడబడిన లోకేష్... టీడీపీ నుంచి పీవీ ప్రధాని అయ్యారని వ్యాఖ్య


తన ప్రసంగాల్లో అప్పుడప్పుడూ తడబడి విమర్శలు కొని తెచ్చుకునే ఏపీ పంచాయతీ రాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్ మరోసారి అదే పని చేసి మీడియాకు చిక్కారు. ఈ ఉదయం పీవీ నరసింహారావు జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, తెలుగుదేశం పార్టీ నుంచి పీవీ ప్రధాని అయ్యారని నోరు జారారు. ఆ వెంటనే తప్పు తెలుసుకున్న ఆయన తెలుగు ప్రజల నుంచి పీవీ ప్రధాని పదవిని అలంకరించారని చెప్పారు. గతంలో అంబేద్కర్ జయంతి రోజును వర్థంతిగా పేర్కొని, పల్లెల్లో తాగునీటి సౌకర్యం లేకుండా చేస్తానని మరోసారి నోరు జారిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News