: ముంబైని ముంచెత్తిన వాన...స్తంభించిన జనజీవనం
ముంబైని వాన ముంచెత్తింది. ఆకాశానికి చిల్లుపడిందా? అన్న స్థాయిలో కురవడంతో ముంబై మహానగరం జలమయమైంది. భారీ స్థాయిలో కురిసిన వర్షానికి ముంబైలోని నాలాలన్నీ పొంగి పొర్లాయి. దీంతో ముంబై నగర రోడ్లన్నీ నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు వెళ్లిపోవడంతో ముంబై వాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షం ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. 2015లో చెన్నైని ముంచెత్తిన వానలు నగరాన్ని అస్తవ్యస్తం చేసిన సంగతి తెలిసిందే. తాజా వర్షంతో ముంబై వాసులు చెన్నై వరదలను గుర్తుచేసుకుంటున్నారు.