: `లిప్‌స్టిక్ అండ‌ర్ మై బుర్ఖా`కు జోయా అక్త‌ర్ మ‌ద్దతు


గ‌త కొన్ని నెల‌లుగా వివాదాల చుట్టూ తిరుగుతున్న `లిప్‌స్టిక్ అండ‌ర్ మై బుర్ఖా` సినిమాకు బాలీవుడ్ నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు జోయా అక్త‌ర్ త‌న మ‌ద్ధ‌తు తెలిపారు. అలంకృత శ్రీ వాత్స‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఉన్న అస‌భ్య‌క‌ర స‌న్నివేశాలు, మాట‌ల కార‌ణంగా సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ స‌ర్టిఫికేష‌న్ వారు దీని విడుద‌ల‌కు నిరాకరించారు.

 చివ‌రికి కొన్ని వివాదాలు కేసుల అనంత‌రం అడ‌ల్డ్ స‌ర్టిఫికెట్ జారీ చేసి సినిమా విడుద‌ల‌కు ఒప్పుకున్నారు. జూలై 21న విడుద‌ల‌కానున్న ఈ సినిమా ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టికే ప‌దికి పైగా అంత‌ర్జాతీయ చ‌ల‌న‌చిత్రోత్స‌వాల్లో వివిధ అవార్డులు సాధించిన ఈ సినిమాలో ర‌త్న పాఠ‌క్ షా, కొంక‌ణా సేన్ శ‌ర్మ‌, అహానా కుమ్రా న‌టించారు. 

  • Loading...

More Telugu News