: సల్లూ ద హీరో


హీరో అంటే కేవలం సినిమాల్లో పేదవారికి సాయం చేసి, ఫైటింగులు చేసి చప్పట్లు కొట్టించుకోవడం కాదు. నిజజీవితంలో కూడా హీరోగానే ఉండాలి. మన సినీ హీరోలు చాలా వరకూ నిజ జీవితంలో ఇలాంటి హీరోయిజం అడపాదడపా చూపిస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా ఇదేదారిలో తన వంతు సమాజసేవ చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో నీటి ఎద్దడి వున్న ఒక ప్రాంతానికి వేల లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాడు.

సల్మాన్‌ ఖాన్‌ తాను స్వయంగా 'బీయింగ్‌ హ్యూమన్‌' అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి దాని ద్వారా సమాజ సేవ చేస్తున్నారు. వేసవి కాలంలో మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో 2000 లీటర్ల సామర్ధ్యం కలిగిన 2500 నీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తానని ఈ మేరకు ఔరంగాబాద్‌ డివిజినల్‌ కమీషనర్‌కు సల్మాన్‌ నుండి ఈ`మెయిల్‌ అందింది. బీయింగ్‌ హ్యూమన్‌ సంస్థ ద్వారా వర్షాభావం వల్ల ఎక్కువ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న బీడ్‌ జిల్లాకు 750, ఉస్మానాబాద్‌ జిల్లాకు 500, ఔరంగాబాద్‌కు 250, నాందేడ్‌కు 250 ట్యాంకుల ద్వారా నీటిని అందించనున్నారు. సల్మాన్‌ భాయ్‌ విశాల హృదయానికి హ్యాట్సాఫ్‌ చెబుదామా...!

  • Loading...

More Telugu News