: డైరెక్టర్ కృష్ణవంశీని రాయలేని పదాలతో దూషించిన డ్యాన్స్ మాస్టర్!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు డ్యాన్స్ డైరెక్టర్ రాకేష్. కృష్ణవంశీని అందరూ క్రియేటివ్ డైరెక్టర్ అని అంటుంటారని... అయితే అతని క్రియేటివిటీ ఏంటో తనకు అర్థం కాదని ఎద్దేవా చేశాడు. అతను 'ఓ బచ్చా డైరెక్టర్' అంటూ విమర్శించాడు. రాయలేని పదాలతో కృష్ణవంశీని దూషించాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'చక్రం' సినిమాలో 'జగమంత కుటుంబం నాది' అనే పాటకు రాకేష్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాటకు సంబంధించి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, 11 రోజుల పాటు ఆ పాటకు పని చేశానని... అయితే, తనను పక్కన పెట్టి ఆయనే అన్ని పనులు చూసుకున్నాడని మండిపడ్డాడు. తనకు రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తాడు. ఇలాంటి పనులు చేయడం వల్లే ఇప్పుడు అతను రోడ్డున పడ్డాడని అన్నాడు. ఇలాంటి డైరెక్టర్ ను ఇంత వరకు తాను చూడలేదని చెప్పాడు.