: ఆధార్, పాన్ కార్డ్ లింక్‌కు ఇంకా రెండు రోజులే గడువు....!
బడ్జెట్ ప్రకటనలో భాగంగా సూచించిన పాన్‌కార్డ్, ఆధార్ లింక్ పూర్తి చేసుకోవడానికి ఇంకా రెండు రోజులే గడువుంది. వచ్చే శనివారం నుంచి ఆధార్, పాన్ కార్డ్ లింక్ తప్పనిసరి చేయనున్నారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ సౌలభ్యం ఉన్న ఆధార్ కార్డును పాన్ నెంబర్‌తో లింక్ చేయడం వల్ల పన్ను ఎగవేత దారులను సులభంగా గుర్తించడమే కాకుండా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డ్‌లు ఉన్న వారిని కూడా కనిపెట్టే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ సంస్కరణకు తెరతీసింది.
పన్ను పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లు కూడా తమ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేసుకోవాలి. లేకపోతే సెక్షన్ 139ఏఏ ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన తేదీ నుంచి వారి పాన్‌కార్డ్ నిరుపయోగంగా మారుతుంది. పాన్ కార్డు ఉండి ఆధార్ లేని వాళ్లకు సుప్రీంకోర్టు కొంత వెసులుబాటు కల్పించింది. కానీ రెండు కార్డులు ఉన్నవారు మాత్రం కచ్చితంగా లింక్ చేసుకోవాలి. మీ పాన్‌కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవడానికి ఇన్‌కంటాక్స్ ఈ-ఫిల్లింగ్ పోర్టల్‌ను సందర్శించండి.