: తెలంగాణ అమ్మాయి ఘనత.. అమెరికా జాతీయ క్రికెట్ జట్టులో స్థానం!


తెలంగాణ అమ్మాయి సాల్గుటి సింధుజ రెడ్డి అమెరికాలో సత్తా చాటింది. యూఎస్ క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఆగస్టు నెలలో స్కాట్లండ్ లో జరగనున్న వరల్డ్ టీ20 క్వాలిఫయర్స్ లో ఆమె అమెరికా తరపున ఆడనుంది. ఈమె స్వస్థలం నల్గొండ జిల్లాలోని ఆమనగల్లు.

గతంలో 14 ఏళ్ల పాటు ఆమె హైదరాబాద్ జట్టుకు సేవలందించింది. వికెట్ కీపర్, బ్యాట్స్ ఉమన్ గా ప్రతిభ కనబరిచింది. ఇదే సమయంలో బీటెక్, ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత  సిద్ధార్థ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికా వెళ్లి పోయింది. యూఎస్ వెళ్లిన తర్వాత తన క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనని ఆమె భావించింది. అయితే భర్త సహకారంతో స్థానిక క్లబ్స్ లో క్రికెట్ ఆడింది. ఆమె ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు ఆమెను జాతీయ జట్టుకు ఎంపిక చేశారు. అమెరికా నేషనల్ టీమ్ కు ఎంపికైన సింధుజపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

  • Loading...

More Telugu News